LokeshKanagaraj : హీరోగా మారుతున్న టాప్ డైరెక్టర్

Update: 2025-05-08 10:00 GMT

హీరోలు దర్శకులు కావడం తక్కువే కానీ.. దర్శకులు హీరోలు కావడం రెగ్యులర్ గా జరిగేదే. ఈ ట్రెండ్ అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో ఉంది. కొందరు దర్శకులు హీరోలు కాకపోయినా మెయిన్ లీడ్స్ లోనో, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గానో ఆకట్టుకుంటున్నారు. అలా ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా హీరోగా మారబోతున్నాడు. యస్.. లోకేష్ సినీవర్స్ పేరుతో బ్లాక్ బస్టర్స్ కొడుతూ సౌత్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకడుగా మారిన లోకేష్ హీరో అవుతున్నాడు. ఆల్రెడీ ఆ మధ్య శ్రుతి హాసన్ తో కలిసి ఓ వీడియోలో కనిపించాడు లోకేష్. ఆ ఎక్స్ పీరియన్స్ తోనేమో.. ఏకంగా హీరోగా మారేందుకు ఓకే చెప్పాడు.

రాకీ, సాని కాయిదమ్, కెప్టెన్ మిల్లర్ వంటి మూవీస్ తో ఆకట్టుకున్న అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో లోకేష్ కనకరాజ్ హీరోగా మారబోతున్నాడు. నిజానికి అరుణ్ మాతేశ్వరన్.. కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ తోనే ఇళయరాజా బయోపిక్ స్టార్ట్ చేశాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు అంటే పది అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. అందుకే అది తర్వాత అనుకుని ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.

ప్రస్తుతం లోకేష్ కూలీ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. మరి ఆ తర్వాత అరుణ్ మాతేశ్వరన్ మూవీలో నటిస్తాడట లోకేష్.

Tags:    

Similar News