Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ పై ఈ న్యూస్ ఏంటీ..

Update: 2024-12-28 05:04 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్ మూడ్ లో ఉంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి వచ్చారు. శంకర్ గత చిత్రం భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ రిజల్ట్ విషయంలో కాస్త భయంగానే ఉన్నారు. అయినా టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు ఊహించినంత పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదు. అంటే ఫ్యాన్స్ ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అది ట్రైలర్ లో ఉంటుంది. బట్ ఈ లోగానే ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రివ్యూస్ నే చెప్పేస్తున్నారు చాలామంది. ఎవరో ఒకరు క్రియేట్ చేసిన ఈ విషయాన్ని ఎవరికి వాళ్లు రకరకాలుగా రాసుకుంటున్నారు.

ముఖ్యంగా గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుంది.. సెకండ్ హాఫ్ అలా ఉండబోతోంది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ఇవన్నీ రిలీజ్ కు ముందు కాస్త బానే ఉంటాయి.పైగా అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి ఓకే అనిపిస్తుంది. బట్ సినిమాలో అంత హైప్ లేకపోతే డబుల్ లాస్ అవుతుందనేది వాస్తవం. సింపుల్ గా చెబితే ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్, కాలేజ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని.. రామ్ చరణ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ క్రాక్ చేసే సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని.. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అప్పన్నగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని.. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనీ రాస్తున్నారు. నిజానికి ఏ నటనా అవార్డ్ కోసం రాదు. చేసిన నటనలకు అవార్డ్స్ వస్తుంటాయంతే.

సుకుమార్ యూఎస్ లో చెప్పిన చిన్న కామెంట్ కు ఎవరికి వాళ్లు తమ ఊహలను జోడించి రాసుకుంటున్న అంశాలివి. ఒకవేళ సినిమాలో అవి అంతే రేంజ్ లో లేకపోతే ఖచ్చితంగా నెగెటివ్ కామెంట్స్ డబుల్ అవుతాయి. అంతన్నారు ఇంతన్నారు.. ఇందులో ఏముందీ అంటూ యాంటీ ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది.

ఇక దీంతో పాటు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ కు కేవలం 5 రోజుల ముందుగా విడుదల చేస్తారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అదే నిజమైతే అది సినిమాకు మైనస్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్యాన్ ఇండియా సినిమాలకు ట్రైలర్ ఎంత ముందుగా వస్తే అంత మంచిది. దాన్ని బట్టి ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఐదు రోజుల ముందు రిలీజ్ చేయడం ఎంతమాత్రం సరైన నిర్ణయం అయితే కాదు. మరి ఇవన్నీ అంచనాలు పెంచడానికి మూవీ టీమ్ నుంచి వస్తోన్న సందేశాలా లేక కేవలం కొందరి ఊహాగానాలా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ వస్తోన్న వార్తలన్నీ చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. 

Tags:    

Similar News