దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన మూవీ లక్కీ భాస్కర్. ఈ దీపావళికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో మరో బ్లాక్ బస్టర్ గా చేరింది లక్కీ భాస్కర్. వైవిధ్యమైన కథ, కథనాలతో హీరో నెగెటివ్ షేడ్స్ లో ఉన్నా.. ఆడియన్స్ కు నచ్చేలా రూపొందించడంలో వెంకీ సూపర్ సక్సెస్ అయ్యాడు. నిజంగా ఇలాంటి కథలు ఇప్పటి వరకూ తెలుగు సినిమాలో రాలేదు. అందుకే చూస్తున్న వారందరికీ విపరీతంగా నచ్చేస్తున్నాడు లక్కీ భాస్కర్.
1989- 92 మధ్య కాలంలో సాగే కథనంగా మొత్తం ముంబైలోనే సాగే ఆ సినిమా ఆద్యంతం ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. దుల్కర్ కు తెలుగులో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కంప్లీట్ అయ్యాయీ మూవీతో. ఇక మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతోన్న ఈ మూవీ నాలుగు రోజుల్లోనే 55.4 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ ఆదివారం వరకూ అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తోనే కనిపించాయి. అందుకే ఈ మూవీకి నాలుగు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ సాధ్యం అయ్యాయి.
ఇక క్లిష్టమైన వీక్ డేస్ లో కూడా లక్కీ భాస్కర్ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. వచ్చే వారం పెద్ద సినిమాలేం లేవు కాబట్టి.. ఈ ఐదు రోజులూ మరింత అదరగొట్టే అవకాశాలున్నాయి.