Maadhav's Maremma : ఊరంతా వల్లకాడు అనేలా మారెమ్మ టీజర్

Update: 2026-02-04 12:01 GMT

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తోన్న మూవీ మారెమ్మ. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ చూడగానే తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలాగా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ మారెమ్మ లాంటి దేవతల పేర్లే తెలంగాణలో ఫేమస్ గా ఉంటాయి. అలా ఈ మూవీ తెలంగాణలోని దేవతల చుట్టూ సాగే కథలాగా కనిపిస్తోంది. టీజర్ చూడగానే మారెమ్మకు కోపం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఊరంతా వల్లకాడు అనిపించే డైలాగ్ ఉంది. అందుకు తగ్గట్టుగా జీవాలు చనిపోవడం, మనుషులు చనిపోవడం కనిపిస్తోంది. ఆ తర్వాత హీరో ఎంట్రీ అతనికి మారెమ్మకు ఉన్న సంబంధం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది అనిపించేలా ఉంది. టీజర్ అయితే కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయాలకు పట్టం కట్టినట్టు కనిపిస్తుంది. బోనాలు, జాతర్లు చాలా ఎక్కువగా కనిపించేలా టీజర్ లో ఉన్న విజువల్స్ బావున్నాయి.

ఇక మాధవ్ క్యారెక్టర్ ఒంటబట్టినట్టుగా కనిపిస్తున్నాడు. అతను ఈ పాత్ర కోసం చాలా హోమ్ వర్క్ చేసినట్టుగా ఉన్నాడు. యాక్సెంట్ పరంగా ఇంకాస్త బెటర్ గా ఉండేలా ఉంది. దీపా బాలు హీరోయిన్ గా కనిపిస్తోంది. మంచాల నాగరాజు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ తో మెప్పించే ప్రయత్నం మాత్రం కనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో అనేది మాత్రం చూడాల్సిందే.

Full View

Tags:    

Similar News