Vishal : ఈ రొడ్డకొట్టుడు సినిమాను తెలుగులో పట్టించుకుంటారా

Update: 2025-01-25 11:00 GMT

ఊరమాస్ ఎంటర్టైనర్స్ అంటేనే తెలుగు ప్రేక్షకులు భయపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఓ పదేళ్ల పాటు ఆ తరహా సినిమాలో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కథల్లో కొత్తదనం ఉండదు. ఒక్కడే వందలమందిని చంపడం.. హీరో కొడితే విలన్స్ అంతా గాలిలో ఫల్టీలు కొడుతూ.. ఆకాశంలోకి వెళ్లి కొన్ని చుక్కలు లెక్కపెట్టి మరీ కిందకు వచ్చేవాళ్లు. తొడకొడితే రైళ్లే భయపడి వెనక్కి వెళ్లిపోయాయి. అందరినీ చంపేసి ఆఖర్లో నీతులు చెప్పారు హీరోలు. ఈ టైమ్ లోనే తమిళ్ నుంచి వచ్చిన వెరైటీ మూవీస్ తెలుగు వారికి ఫ్రెష్ గా కనిపించాయి. కథల్లో కొత్తదనం మనవాళ్లను ఆకట్టుకుంది. ఆ టైమ్ లోనే తమిళ్ మూవీ వస్తోందంటే తెలుగు హీరోలు కూడా భయపడిన దాఖలాలూ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్లీ 2010 తర్వాత నుంచి కాస్త మనవాళ్లూ మారారు. అటు కోలీవుడ్ మనలాగా ఊరమాస్ సినిమాలు మొదలుపెట్టింది. ఆ కోవలో వచ్చిందే ఈ విశాల్ నటించిన మదగజరాజా అనే సినిమా.

ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం పూర్తయిన ఈ చిత్రం విడుదల కాకుండా ఆగిపోయింది. చివరికి ఈ సంక్రాంతికి తమిళనాడులో విడుదల చేస్తే అనూహ్యంగా పెద్ద హిట్టుగా నిలిచింది. కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. సంతానం కామెడీ హైలెట్ గా నిలిచింది అన్నారు. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్ద హిట్టు కాగానే సుందర్ కూడా ఓ ఇదై పోయి తనను ఇంకా పెద్ద డైరెక్టర్ అనడం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు.

ఇక విశాల్ సినిమా అంటే ఆ దబిడి దిబిడి మనకూ తప్పదు కదా. కాకపోతే పాత సినిమా కాబట్టి ఒకేసారి విడుదల చేయలేదు. బాగా గ్యాప్ ఇచ్చి ఈ నెల 31న తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే పరమ రొటీన్ గా కనిపిస్తుంది. అదే గాలిలో విలన్స్.. ఇద్దరు హీరోయిన్ల మధ్య హీరో. కొన్ని నాలుగు ఫైట్లు, ఆరు పాటల ఫార్ములాతో ఏ మాత్రం కొత్తదనం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనేలా ఉందీ ట్రైలర్. ప్రస్తుతం తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టైమ్ లో ఇలాంటి రొడ్డకొట్టుడు సినిమాను చూస్తారా అంటే డౌటే అనాలి. అదే టైమ్ లో ఏమో.. ఏ సినిమాలో ఏం కనెక్ట్ అవుతుందో ఎవరికి తెలుసు. సో.. రిలీజ్ అయితే కానీ ఈ మదగజరాజా మనోళ్లకు నచ్చుతాడా లేదా అనేది తెలుస్తుంది. 

Full View

Tags:    

Similar News