Mahesh Babu : మహేష్ బాబు ఒళ్లు హూనం కాబోతోందా..?

Update: 2025-07-16 09:15 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా గురించిన కొత్త కబుర్లు ఒక్కటీ బయటకు రాకుండా చూసుకుంటున్నాడు రాజమౌళి. అఫ్ కోర్స్ షెడ్యూల్స్, షూటింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఫస్ట్ షెడ్యూల్ లోనే వచ్చిన లీకుల కారణంగా మళ్లీ అవి రిపీట్ కాకుండా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. మూడు దశల్లో సెల్ ఫోన్ చెకింగ్ ఉంటుంది. లొకేషన్ లోకి ఎవరి ఫోన్ కూ అనుమతి లేదు అని ఖచ్చితంగా చెప్పేసి పాటించారు. రీసెంట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఈ మూడో వారంలో ఆఫ్రికాలోని నైజీరియా దేశానికి వెళుతోంది టీమ్. ఇందులో మెయిన్ ఆర్టిస్టులంతా ఉంటారు. మామూలుగా ఈ కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలోనే చెప్పాడు. సో.. ఆ ఫారెస్ట్ ను తలపించాలంటే ఆఫ్రికా అడవులే కరెక్ట్ కదా. అందుకే ఆ ప్లేస్ కే వెళుతున్నారు.

నైజీరియా షెడ్యూల్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఈ షెడ్యూల్ లో మంచి అడ్వెంచరస్ సీన్స్ ను ప్లాన్ చేసుకున్నారట. అందుకే మహేష్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా షూటింగ్ లో ఉండబోతున్నారు. మొత్తంగా మహేష్ బాబు ఒళ్లు హూనం చేసే షెడ్యూల్ అని కొందరు సెటైరిక్ గా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ కాస్త సుతారంగా ఉండేలానే చూసుకున్నాడు సూపర్ స్టార్. బట్ రాజమౌళితో మామూలుగా ఉండదు కదా. ఆ విషయంలో మీలో ఎవరు కోటీశ్వరుడులో ఎన్టీఆర్ కూడా మహేష్ తో అన్నాడు. అప్పుడు మహేష్ బాబుకు అర్థమై ఉండదు. కానీ ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఏదేమైనా చాక్లెట్ బాయ్ లాంటి సూపర్ స్టార్ ను నైజీరియా అడవుల్లో పరిగెత్తించబోతున్నాడు రాజమౌళి.

Tags:    

Similar News