కాలినడకన తిరుమలకు మహేశ్.. మొక్కు ఏంటో తెలుసా?

Update: 2024-08-16 07:15 GMT

తిరుమల శ్రీవారిని నటుడు మహేశ్ బాబు ఫ్యామిలీ దర్శించుకుంది. మంగళవారం రాత్రి తిరుపతికి వచ్చిన నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితార.. అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి.... తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాళ్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నమ్రతా శిరోద్కర్‌.

అతిత్వరలోనే మహేశ్ బాబు రాజమౌళితో చేస్తున్న ప్యాన్ వరల్డ్ సినిమా మొదలు కాబోతోందని చెబుతున్నారు. ఇది యజ్ఞంలా కొనసాగబోతోంది. అందుకే మహేశ్ బాబు ఫ్యామిలీ తిరుమలలో ప్రథమ పూజ చేసినట్టు సమాచారం.

Tags:    

Similar News