Mahesh Babu : అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్..!
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.;
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో 56 ఏళ్ల రమేశ్‌బాబు జనవరి 8న తుది శ్వాస విడిచారు.ఆ సమయంలో మహేష్ కి కరోనా సోకడంతో రమేష్ బాబు అంత్యక్రియలకి హాజరు కాలేకపోయారు. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్శనివారం (జనవరి 22) తన అన్నయ్య రమేశ్‌బాబు పెద్దకర్మకు హాజరయ్యారు.
అత్యంత సన్నిహితుల మధ్య రమేశ్ బాబు పెద్దకర్మ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అన్నయ్యతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు కన్నీటి పర్యంతమైనట్లుగా సమాచారం. అన్నయ్య రమేష్ బాబు అంటే తనకి ఎంత ఇష్టమో మహేష్ బాబు పలు వేదికల పైన చెప్పారు. రమేశ్‌బాబు చనిపోయినప్పుడు మహేష్ భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.