EMK Mahesh Babu Promo: ఎవరు మీలో కోటీశ్వరులు నుండి మహేశ్ బాబు ఎపిసోడ్ ప్రోమో విడుదల..
EMK Mahesh Babu Promo: ఇద్దరు టాప్ స్టార్లు ఒకే వేదికపై మెరిస్తే.. ఇక వారి మ్యుచువల్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు.;
EMK Mahesh Babu Promo: ఇద్దరు టాప్ స్టార్లు ఒకే సినిమాలో కనిపించినా.. ఒకే వేదికపై మెరిసినా.. ఇక వారి మ్యుచువల్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. అలాంటి మూమెంట్ త్వరలోనే ఎన్‌టీఆర్, మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు రానుంది. వీరిద్దరు ఇప్పటివరకు పలు ఆడియో ఫంక్షన్స్‌లో, అవార్డ్ ఫంక్షన్స్‌లో కలిసి కనిపించారు. కానీ ఈసారి మాత్రం ఎన్‌టీఆర్ హోస్ట్ చేస్తున్న షోకు మహేశ్ గెస్ట్‌గా రానున్నారు.
'ఎవరు మీలో కోటీశ్వరులు'కి ఎన్‌టీఆర్ హోస్టింగ్ మెయిన్ హైలైట్. అందులోనూ అప్పుడప్పుడు వచ్చే సెలబ్రిటీలు దీనికి ప్రత్యేక ఆకర్షణ. మొదటి ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తర్వాత ఇప్పటివరకు ఏ స్టార్ హీరో ఎవరు మీలో కోటీశ్వరుడు స్టేజ్‌పై అడుగుపెట్టలేదు. అందుకే మహేశ్ బాబు రానున్నాడు అని తెలియగానే పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
తాజాగా ఈ పూనకాల ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది. కేవలం 20 సెకండ్ల ప్రోమోకే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇంక ఎపిసోడ్‌కు ఈ ఎక్సైట్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రోమోలో కూడా ఎపిసోడ్ టెలికాస్ట్ ఎప్పుడో చెప్పకుండా సస్పెన్స్‌లోనే పెట్టింది ఈఎంకే టీమ్.