Mahesh Babu Family : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ ఫ్యామిలీ

Update: 2024-08-15 10:15 GMT

సినీహీరో మహేశ్ బాబు కుటుంబం ఇవాళ తిరుమలేశుడిని దర్శించుకుంది. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ, సతీమణి నమ్రత, కూతురు సితార ఇవాళ అలిపిరి మెట్లమార్గం గుండా కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతో వారి ప్రయాణం ఎంతో సింపుల్గా సాగింది. ముఖ్యంగా మార్గమధ్యంలో అభిమానులతో ముచ్చటిస్తూ ఎంతో సులువుగా కలిసిపోయారు ఈ కుటుంబీకులు. చాలా సాధారణ భక్తుల్లా వారు స్వామివారి చెంతకు భక్తి శ్రద్ధలతో వెళుతూ కనిపించారు. తమకు ఎస్కార్ట్ గా వచ్చిన సహాయకులు, భక్తులందరికీ నమ్రత ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్డమ్ .. సెలబ్రిటీ హోదాను మించి అందరితో సున్నితంగా కలిసిపోవడం అనేది సూపర్ స్టార్ కృష్ణ నుంచి వస్తున్న గొప్ప క్వాలిటీ. దానిని మహేష్ తన వారసులకు కూడా ఫాలో అయ్యారు. అభిమానంగా సెల్ఫీ కోరితే దానికి సహకరించాడు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సర్త్కరించారు. సంప్రదాయ వస్త్రధారణలో గౌతమ్ ఆకట్టుకోగా... నమ్రతా, సీతారలు సింప్లిసిటీతో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News