Mahesh Babu : హ్యాట్సాఫ్ సూపర్ స్టార్... చిన్నారుల కోసం మహేష్ మరో ముందడుగు...!
Mahesh Babu : కేవలం సినిమాలతోనే కాకుండా మంచి సామాజిక సేవా కార్యక్రమాల కూడా చేసి అభిమానుల చేత సూపర్ స్టార్, రియల్ హీరో అని అనిపించుకున్నారు.;
Mahesh Babu : కేవలం సినిమాలతోనే కాకుండా మంచి సామాజిక సేవా కార్యక్రమాల కూడా చేసి అభిమానుల చేత సూపర్ స్టార్, రియల్ హీరో అని అనిపించుకున్నారు మహేష్ బాబు.. ఇప్పటికే వేయి మందికి పైగా చిన్నారులకి హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు.
ఇప్పటివరకు తన ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీలు చేయించిన మహేష్.. తాజాగా రెయిన్బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో చేతులు కలిపారు. ఈ ఫౌండేషన్‌తో కలిసి ఆర్ధికంగా వెనుకబడిన చిన్నారులకి గుండె ఆపరేషన్లు చేయించనున్నారు. త్వరలోనే 125 మంది పిల్లలకు ఆపరేషన్లు జరగనున్నాయి.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వచ్చేసరికి పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నారు మహేష్.. షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది.