Mahesh babu : మహేష్ మాస్ లుక్.. ఇంకో లెవల్ అంతే..!
Mahesh babu : మహేష్ బాబు హీరోగా, పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.
Mahesh babu : మహేష్ బాబు హీరోగా, పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ సినిమా నుంచి ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.. రిలీజ్ చేసిన పోస్టర్‌లో మహేష్ అదిరిపోయే మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చెక్డ్ షర్ట్ మరియు బ్లాక్ జీన్స్ ధరించి.. బీచ్‌లో ఫైట్‌కు సిద్ధంగా ఉన్నట్టుగా పోస్టర్‌లో మహేష్ కనిపిస్తున్నాడు.. కాగా ఇప్పటికే విడుదల చేసిన కళావతి, పెన్ని సాంగ్స్ యూట్యూబ్‌లో ఓ ఊపు ఊపేస్తున్నాయి.. కాగా ఈ చిత్రాన్ని మే 12న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
#SarkaruVaariPaata 💥💥 pic.twitter.com/QStlwhWobO
— 14 Reels Plus (@14ReelsPlus) April 2, 2022