Sarkaru Vaari Paata : సమ్మర్‌లో కూల్‌గా మహేష్ 'సర్కారు వారి పాట'..!
Sarkaru Vaari Paata : కరోనా కారణంగా టాలీవుడ్‌లో ఇన్నిరోజులు వాయిదా పడిన సినిమాలన్ని ఇప్పుడు వరుసపెట్టి రిలీజ్‌కి సిద్దమవుతున్నాయి.;
Sarkaru Vaari Paata: కరోనా కారణంగా టాలీవుడ్‌లో ఇన్నిరోజులు వాయిదా పడిన సినిమాలన్ని ఇప్పుడు వరుసపెట్టి రిలీజ్‌కి సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. మే 12న సినిమాని రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ అనౌన్సు చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మహేష్.. కళ్ళ పై దోసకాయ ముక్కలు పెట్టుకొని కూల్‌గా కూర్చొని కనిపిస్తున్నాడు.
ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఇప్పుడు దానిని మే 12కి షిఫ్ట్ చేశారు. మార్చ్ 25 న ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్‌లో సందడి చేయనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 1న భీమ్లా నాయక్, ఏప్రిల్ 29న ఆచార్య, ఒక్కరోజు ముందు వెంకీ, వరుణ్ ఎఫ్3 రిలీజ్ అవుతున్నాయి.. ఇవన్ని అయిపోయాక సమ్మర్ ఎండింగ్‌లో కూల్‌గా మహేష్ థియేటర్ లోకి రానున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట లో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.