కమిటీ కుర్రాళ్లు.. అంతా కొత్తవాళ్లే నటించిన సినిమా. నాగబాబు కూతురు నిహారిక నిర్మించింది. ఈ నెల 9న విడుదల కాబోతోంది. అగ్రెసివ్ గా ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. కానీ నిర్మాతగా నిహారిక ఫస్ట్ మూవీకి మహేష్ బాబు షాక్ ఇవ్వబోతున్నాడు. ఇంకా చెబితే ఇచ్చేశాడు కూడా అంటున్నారు. యస్ ఈ శుక్రవారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ చిన్నవే. అయినా ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తోన్న మూవీ కమిటీ కుర్రాళ్లు. ఒక్కటీ తెలిసిన మొహం లేదు. ఏదో కంటెంట్ ఉన్నట్టు కనిపిస్తోంది కానీ.. ఆ కంటెంట్ ను చూడ్డానికి జనాన్ని థియేటర్స్ కు రప్పించే కనీస పోస్టర్ వాల్యూ కూడా లేదు.
బట్ ఈ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి మూవీ రీ రిలీజ్ ఉంది. రీ రిలీజే అయినా.. దీనికి రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఓ మూవీ రీ రిలీజ్ కు ఈ స్థాయిలో బుక్ మై షోలో టికెట్స్ బుక్ అయిపోవడం అరుదు అనే చెప్పాలి. మహేష్ బర్త్ కూడా కావడం, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవడంతో పాటు ఇరవైయేళ్ల క్రితం మహేష్ యాక్టింగ్ చూసేందుకు ఈ తరం ఆడయన్స్ అంతా ఈగర్ గా ఉండటం అన్నీ.. కలిపి మురారి పై భారీగా ఫోకస్ అయ్యాయి. దీంతో అదే రోజు విడుదలవుతున్న కమిటీ కుర్రాళ్లు అనే కాదు.. ఇతర ఏ సినిమాకైనా మురారి పెద్ద అడ్డంకిగా మారింది. నిజానికి కొన్నాళ్లుగా వస్తోన్న చిన్న సినిమాలేవీ ఆకట్టుకోవడం లేదు. కంటెంట్ లేకపోవడమే కాదు.. కొన్ని సిల్లీ మూవీస్ కూడా ఆడియన్స్ ను థియేటర్ కు వెళ్లాలంటే భయపడేలా చేశాయి. ఈ తరుణంలో మురారి లాంటి మూవీ వస్తోంటే ఇంక కుర్రాళ్ల సినిమాలేం పట్టించుకుంటారు. అందువల్ల నిర్మాతగా నిహారికకు పెద్ద షాక్ తప్పేలా లేదు అంటున్నారు.