అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దీనికి కథ అందించారు. నవంబర్ 14న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని.. అందులో మహేశ్ నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి షూట్ చేశారని టాక్. సినిమా క్లైమాక్స్‌లో మహేశ్.. కృష్ణుడి అవతారంలో దర్శనమివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.