Mahesh Babu : మహేష్ బాబు మూవీకి అరుదైన రికార్డ్

Update: 2025-03-19 09:00 GMT

థియేటర్స్ లో యావరేజ్ అనిపించుకున్న సినిమాలు టివిల్లోనో, ఓటిటిల్లోనో ఆకట్టుకోవడం కామన్ గా చూస్తాం. అయితే ఓ మూడు నాలుగు సార్లు టివిల్లో వచ్చిందంటే ఇంక ఆ మూవీని పట్టించుకోవడం మానేస్తాం. ఆఖరికి ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ టివిలో ప్రసారమైన ప్రతి సారీ.. బ్లాక్ బస్టర్ రేటింగ్ తెచ్చుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ విషయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ మా టివి వద్ద ఉన్నాయి. మా టివిలో ఎప్పుడు ప్రసారమైనా ఇంక రిమోట్ కు పని చెప్పుకుండా చూస్తూనే ఉంటారు చాలామంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ రెన్యూవల్ చేసుకోవడంతో ఇన్నాళ్ల తర్వాత కూడా నిర్మాతకు కొంత ప్రాఫిట్ తెచ్చింది అతడు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ మరో రేర్ మైల్ స్టోన్ ను చేరుకుంది.

తక్కువ టైమ్ లో ఎక్కువసార్లు టివిలో ప్రసారమైన సినిమాగా అతడు రికార్డ్ నెలకొల్పింది. 2005 ఆగస్ట్ 10న విడుదలైన అతడు మూవీ ఈ ఇరవైయేళ్లలో 1500 సార్లు టివిలో ప్రసారమైందట. అంటే కాస్త అటూ ఇటూగా యేడాదికి 80 సార్లు ప్రసారమైందని చెప్పొచ్చు. ఇవి కాక ఇంకా లోకల్ ఛానల్స్ లో కూడా ఎన్నోసార్లు ప్రసారమై ఉంటుంది. సో.. తక్కువ టైమ్ లోనే 1500 సార్లు ప్రసారం కావడం ఈ మూవీకి దక్కిన గౌరవంగానే చెప్పాలి.

సీనియర్ నటుడు మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రం మహేష్,త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ. త్రిష హీరోయిన్. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, సునిల్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నాజర్, సుధ, ఒకే సీన్ లో ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించిన ఈ మూవీ థియేటర్స్ లో చాలా యావరేజ్ సినిమాగా నిలవడం విశేషం.

Tags:    

Similar News