Mahesh Babu : మహేష్ మురారి ఓకే.. కానీ అసలు న్యూస్ ఎక్కడ ..?

మహేష్ బాబు మురారిని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న అసలు అప్డేట్ ఎప్పుడు వస్తుంది..?;

Update: 2024-07-18 10:47 GMT

కొన్నాళ్లుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా బర్త్ డే స్పెషల్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటికే మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి వంటి మూవీస్ ను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మురారి వంతు. ఓరకంగా మహేష్ బాబుకు ఫస్ట్ సోలో హిట్ మురారి అనే చెప్పాలి. రాజకుమారుడు హిట్ అనిపించుకున్నా.. అప్పుడు అతని తెరంగేట్రంగానే చూశారు. హీరో కృష్ణ ఇంకా ఫామ్ లో ఉండటం కూడా కొంత ప్లస్ అయింది. కానీ సాలిడ్ హిట్ అంటే మురారి అనే చెప్పాలి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా.. డివోషనల్ టచ్ తో కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ మూవీలో మహేష్, సోనాలిబింద్రేల లవ్ ట్రాక్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అలాంటి మూవీని ఈ సారి మహేష్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 20 నిమిషాల వరకూ ట్రిమ్ చేశారట. సో.. ఇప్పటి యంగ్ స్టర్స్ కు కూడా సినిమా బాగా నచ్చేస్తుందన్నమాట.

మురారి వరకూ బానే ఉన్నా.. మహేష్ ఫ్యాన్స్ కోరుకునేది మాత్రం ఇది కాదు. రాజమౌళితో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ అయింది. ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ షూటింగ్ ఎప్పటి నుంచీ.. హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ ఎవరూ అనే అంశాలు మాత్రం ఇప్పటి వరకూ ఎవరూ చెప్పడం లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింటింగ్ గా ఉన్నారు. సో కనీసం బర్త్ డే కోసం అయినా ఏదైనా సాలిడ్ అప్డేట్ వస్తుందో చూడాలి. 

Tags:    

Similar News