సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న మూవీ ‘జటాధర’.వెంకట్ కళ్యాణ్ - అభిషేక్ జైశ్వాల్ ద్వయం దర్శకత్వం చేస్తున్న మూవీ ఇది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఆ మధ్య వచ్చిన ఈ మూవీ టీజర్ తోనే భయపెట్టారు. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు అని ఆ టీజర్ తో అర్థం అయింది. మంచికి చెడుకు మధ్య సాగే పోరాటం, త్యాగానికి, దురాశ మధ్య జరిగే సమరం అంటూ టీజర్ లో కొన్ని లైన్స్ వేశారు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రం కోసం మొన్నటి తరం బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ ను కూడా ఓ కీలక పాత్రలో తీసుకున్నారు. తను ఈ చిత్రంలో శోభ అనే పాత్రలో నటిస్తోందని తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. శిల్పా శిరోద్కర్.. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు సొంత చెల్లెలు కావడం విశేషం. ఈ జనరేషన్ కు పెద్దగా తెలియదు కానీ 90స్ లో తను బాలీవుడ్ లో స్టార్డమ్ అనుభవించింది. 1992లో మోహన్ బాబు హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బ్రహ్మ’లో తను ఓ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలోని ముసి ముసి నవ్వులలోనా అనే పాటలో కనిపించేది శిల్పా శిరోద్కరే. ఆ తర్వాత తను తెలుగులో మరే సినిమా చేయలేదు. ఇన్నేళ్లకు జటాధర మూవీలో తను ఓ కీలక పాత్ర చేస్తుందని మాత్రం ఈ పోస్టర్ తో తెలుస్తోంది. అలాగే తనది నెగెటివ్ రోల్ గా కనిపిస్తోంది. సో.. తను సుధీర్ బాబుకు చెల్లి అవుతుంది. మరి సినిమాలో ఎలాంటి రిలేషన్ తో కనిపిస్తుందో చూడాలి.