సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు, నమృత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అది తెలుగు బిగ్ బాస్ లోకి కాదు. హిందీ బిగ్ బాస్ లోకి. అవును హిందీ బిగ్ బాస్ 18వ సీజన్ ఇటీవల లాంఛనంగా మొదలయ్యింది. ఈ సీజన్ లో నాలుగవ కంటెస్టెంట్ లా ఎంట్రీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్. ఈ సందర్భంగా స్టేజిపై ఆసక్తికర కామన్స్ చేసింది. తనకు బిగ్‌బాస్ షో అంటే విపరీతమైన అభిమానమని, తన కల నిజమైన క్షణమని సంతోషం వ్యక్తం చేసింది. తన ప్రయాణం పట్ల ఆనందంగా ఉన్నట్లు చెప్పిన శిల్పా బిగ్‌బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లమని తన కూతురే అడిగిందని, ఆ విషయంలో అందరికంటే ఎక్కువ తన కూతురు సంతోషంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.