Mahesh Namrata Photoshoot: ఎవర్‌గ్రీన్ కపుల్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్..
Mahesh Namrata Photoshoot:మహేశ్ బాబు, నమ్రత.. వీరిద్దరు టాలీవుడ్‌లో ఉన్న పర్ఫెక్ట్ కపుల్‌లో ఒకరు.;
Mahesh Namrata Photoshoot:మహేశ్ బాబు, నమ్రత.. వీరిద్దరు టాలీవుడ్‌లో ఉన్న పర్ఫెక్ట్ కపుల్‌లో ఒకరు. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా వెలిగిపోతున్న ఈ కపుల్‌ను ఎప్పుడు చూసిన నిన్న, మొన్న పెళ్లి అయ్యిందేమో అన్నట్టుగానే ఉంటారు. ఈ మధ్య వీరిద్దరు కలిసి చేసిన ఫోటోషూట్ చూస్తుంటే ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నమ్రత హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. అదే సమయంలో బి గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమాలో మహేశ్‌తో నటించే అవకాశం దక్కించుకుంది.
వంశీ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు మహేశ్, నమ్రత. ఇప్పటికీ ఈ సినిమా విడుదలయ్యి 21 సంవత్సరాలు అయ్యింది.
ఆ తర్వాత నమ్రత సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది. మహేశ్ షెడ్యూల్స్‌ను దగ్గరుండి చూసుకుంటోంది.