సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా 'కూలీ'. ఈ కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. కూలీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షబీర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందిస్తున్నాడు. కొన్నాళ్లుగా లోకేష్ సినీవర్స్ అనేది క్రియేట్ చేసి ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు లోకేష్. అయితే చివరగా వచ్చిన లియో అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి. ఆల్రెడీ కమల్ కు విక్రమ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన లోకేష్ మరో వెటరన్ అయిన రజినీతో కూలీ మూవీ చేస్తున్నాడు అన్నప్పుడు అంచనాలు భారీగా కనిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బిజినెస్ కనిపిస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ రైట్స్ కు భారీ స్థాయిలో డిమాండ్ కనిపిస్తోంది.
ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ ముగిసింది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. నిన్నటితో కూలీ చిత్రీకరణ పూర్తయిందంటూ ఓ చిన్న వీడియోతో పాటు ప్రకటించారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిజానికి ఇంతమంది స్టార్స్ ఉన్నా.. చాలా తక్కువ టైమ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశాడు లోకేష్. అందుకు ప్రధాన కారణం అతని చిత్రాల్లో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పెద్దగా కనిపించవు. అందుకే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తక్కువ వర్కింగ్ డేస్ లోనే కూలీ చిత్రీకరణ పూర్తి చేశాడు. సో.. క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా చాలా టైమ్ ఉంది. అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసే అవకాశాలున్నాయి.