Gujarat: పెళ్లిపీటల మీదే వధువు మృతి.. ఆమె చెల్లెలితో వరుడికి..

Gujarat: అప్పటి వరకు బాగానే ఉంటున్నారు. అంతలోనే కుప్పకూలిపోతున్నారు. వయసుతో పనిలేదు.. మృత్యువు ముంచుకొచ్చేస్తుంది.

Update: 2023-02-27 07:57 GMT

Gujarat: అప్పటి వరకు బాగానే ఉంటున్నారు. అంతలోనే కుప్పకూలిపోతున్నారు. వయసుతో పనిలేదు.. మృత్యువు ముంచుకొచ్చేస్తుంది. పెళ్లి వేడుకతో కళకళాలాడ్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అయినా కన్నీటి మధ్యే తమ రెండో కూతురిని అతడికి ఇచ్చి వివాహం జరిపించారు.ఈ ఘటన గుజరాత్ భగవానేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలో చోటు చేసుకుంది. భావ్‌నగర్‌కు చెందిన వధువు హేతల్‌కు వరుడు విశాల్‌తో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. వివాహ వేడుక సమయం రానే వచ్చింది. కళ్యాణ మండపంలో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు అనారోగ్యానికి గురై కుప్పకూలిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి కలత చెందిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆప్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వరుడి కుటుంబసభ్యులు వివాహ వేడుకను కొనసాగించే ప్రక్రియలో భాగంగా హేతల్‌ చెల్లెలితో తమ కుమారుడికి వివాహం జరిపించాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన కుటుంబసభ్యులు వివాహం జరిగే వరకు హేతల్ మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు.

ఈ ఘటన చాలా బాధాకరమని భావ్‌నగర్‌ నగర కార్పొరేటర్‌, మల్ధారీ సమాజ్‌ నాయకుడు లక్ష్మణ్‌భాయ్‌ రాథోడ్‌ అన్నారు. వధువు కుటుంబీకులు బంధువులే అయినప్పటికీ వరుడిని రిక్తహస్తాలతో పంపవద్దని, కుటుంబం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అన్నారు.

Tags:    

Similar News