Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ కి అడ్డే లేదుగా

Update: 2026-02-05 07:44 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్రతిహతంగా సాగిపోతోంది. సంక్రాంతి మరిలో విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. అయితే ఇలాంటి మూవీస్ పండగ తర్వాత కాస్త స్లో అవడం కనిపిస్తుంది. బట్ వీళ్లు మాత్రం ఇప్పట్లో ఆగేలా లేరు. ఈ మూవీ వసూళ్ల పరంగా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ డిక్లేర్ అయింది. అయినా కూడా వసూళ్లు ఆగడం లేదు. నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ వాళ్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో పాటు మూవీకి వచ్చిన వసూళ్లు కూడా 375 కోట్లు ప్లస్ అని ప్రకటించారు. నిజానికి ఈ మూవీ ఆల్రెడీ 400 కోట్లు అని చెప్పారు. కాకపోతే టికెట్ ధరలు పెంచిన కారణంగా జీఎస్టీ వాళ్లతో వచ్చిన ఇబ్బంది కారణంగానే ఈ మొత్తం ప్రకటించారు. 375 ప్లస్ అంటే మాత్రం ఇంకా ఆ లెక్కలు కూడా పెరగబోతున్నాయి అని కదా.

మన శంకరవరప్రసాద్ గారు ఈ నెల 11నుంచి ఓటిటిలో రాబోతోంది. అయితే ఇప్పటికే మాగ్జిమం థియేటర్స్ లో స్టడీగా ఉండటంతో ఈ మేరకు ఓటిటి వారితో మాట్లాడి ఆ డేట్ మార్చే అవకాశం కూడా ఉందేమో. మొత్తంగా నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వెంకటేష్ ఓ కేమియో రోల్ చేశాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. 

 

Tags:    

Similar News