Manchu Lakshmi : పెళ్లికి ముందే ప్రేమలో.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్

Manchu Lakshmi :

Update: 2022-10-10 09:40 GMT

Manchu Lakshmi: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై ఆయన సోదరి మంచు లక్ష్మి స్పందించింది. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. 'మనోజ్ పెళ్లి చేసుకుంటే నేనేం చెబుతాను? ఎవరి ఇష్టం వాళ్లది. ఎవరి జీవితం వాళ్లని గడపనివ్వండి. నేను నిజాయితీగా ఉన్న ప్రేమను ఆశీర్వదిస్తాను.

ప్రతి ఒక్కరి జీవితంలో రెండు భావోద్వేగాలు ఉంటాయి. ఒకటి ప్రేమ, రెండోది భయం. మనం దేనితో కలిసి జీవిస్తున్నామో తెలుసుకోవాలి. నేను మాత్రం ప్రేమించడాన్ని, ప్రేమగా ఉండడాన్ని ఇష్టపడతాను అని చెప్పారు మంచు లక్ష్మి. పెళ్లికి ముందే వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ వారి ప్రేమను భూమా దంపతులు అంగీకరించలేదు. దాంతో వాళ్లిద్దరూ వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమ భాగస్వాములతో విడిపోవడంతో వారి మధ్య పాత ప్రేమ చిగురించింది.

ఇంకా, ఎన్నికలు, రాజకీయాలపై కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు లక్ష్మి. మాపై రాజకీయ బురద చల్లారు. అందులోకి వచ్చాక మంచి చెడ్డలను అంగీకరించాలి. ఈ అభిమానులు ఇతర హీరోల గురించి ఎందుకు చెడుగా మాట్లాడతారు? వారు మాపై రాళ్లు రువ్వడానికి ప్రయత్నిస్తారు.

మోహన్ బాబు పిల్లలుగా మేము ఎక్కడికి వెళ్లినా ప్రేమను మాత్రమే పంచుకుంటాం. ఈ ప్రతికూలత ఎక్కడ నుండి వస్తుందో నాకు తెలియదు. అయినా వారి నుంచి పాఠాలు నేర్చుకుంటాం అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. కాగా మంచు మనోజ్, మౌనిక త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News