తమిళ్ లో సూపర్ హిట్ అయిన గరుడన్ చిత్రాన్ని తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. అక్కడ శశికుమార్, సూరి, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్నేహం, ద్రోహం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ మూవీని తెలుగులో బెల్లకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిస్తున్నారు. నాంది, ఉగ్రమ్ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ శ్రీనివాస్ పోస్టర్ ను విడుదల చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని రోహిత్ పోస్టర్ విడుదల చేస్తే దానిక అప్లాజ్ వచ్చింది. ఇక ఈ మూవీలో పూర్తి గ్రే షేడ్ క్యారెక్టర్ లో నటించబోతున్న మంచు మనోజ్ పోస్టర్ వదిలారు.
మనోజ్ ఈ మూవీలో గజపతి వర్మ అనే పాత్రలో నటించబోతున్నాడు అని చెప్పారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. హీరోగా ఫెయిల్ అయిన మనోజ్ ఈ మూవీతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. మరి అతనికి ఈ మూవీ ఎలాంటి కెరీర్ ను ఇస్తుందో కానీ.. గరుడన్ చూసిన వారికి తెలుగులో ఈ కాస్టింగ్ పర్ఫెక్ట్ అనిపిస్తోంది.
కేకే రాధమోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా సాగుతోంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ రాబోతున్నాయి.