Manchu Manoj : మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి.. ప్యాన్ ఇండియాగా

Update: 2025-12-18 07:11 GMT

మంచు మనోజ్ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ మధ్య రకరకాల టైటిల్స్ తో అనౌన్స్ చేసిన మూవీస్ ఇప్పుడు అవుతున్నాయా లేదా అనేది తెలియదు. బట్ ఈ సారి మాత్రం డేవిడ్ రెడ్డిగా రాబోతున్నాడు. ఈ టైటిల్ లో కొత్తదనం ఏం కనిపించలేదు. బట్ సినిమా నేపథ్యం మాత్రం కొత్తగా ఉండబోతోందనేది మాత్రం తెలిసింది. అదీ కాక స్వాతంత్ర్యానికి పూర్వం కథతో రూపొందబోతోంది. రీసెంట్ గా ఈ డేవిడ్ రెడ్డి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. అదేమంత కొత్తదనంతో కనిపించలేదు. సింపుల్ గా అన్ని మాస్ మూవీస్ లాగానే కనిపిస్తోంది తప్ప బిఫోర్ ఇండిపెండెన్స్ మూవీలా మాత్రం కనిపించడం లేదు. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ టీజర్ విడుదలద చేశారు.

‘ఏంటి నాన్నా చాలా రోజులుగా మన ఫ్యాక్టరీ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి.. రాత్రి కూడా జరుగుతుంది.. ఏం వర్క్ నాన్నా..’ అని ఒక అబ్బాయి అని అడుగుతున్నట్టుగా డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ తో పాటు ఆ వర్క్ కు సంబంధించిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏం వర్క్ అనే దానికి సమాధానంగా ‘వేగాన్ని తయారు చేస్తున్నాం.. నీకు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తెలుసు కదా.. నీకు ఇంకొకరి గురించి చెప్పాలి. అతనిదే ఈ వేగం. అతను బ్రిటీషర్స్ కు శతృవే, ఇండియన్స్ కే శతృవే. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పా కదా.. ఆ తర్వాత జలియన్ వాలాబాగ్. భారతీయుల రక్తం తాగిన రోజున.. ఎదురించిన పోరాడలేక చాలామంది సర్దుకు పోయారు. కానీ ఒక్కడు మాత్రం సిద్ధం అయ్యాడు. పాతిక కోట్ల మంది కోపం. వాడొక్కడి రక్తంలో నిండింది. మరిగే రక్తం నిప్పులు కక్కుంది. గుండెకు నేలకదిలింది.. ఆ వేగాన్ని తూగే వేగాన్ని ఆ రోజు తన పంజాతో సృష్టించాడు. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటీషర్స్ అతను వార్ డాగ్ అయ్యాడు.. ’ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో మాత్రం కనిపిస్తోందీ టీజర్.

‘ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై’అనే మనోజ్ డైలాగ్ మాత్రం కనిపిస్తోంది. మొత్తంగా ఈ టీజర్ లో మరీ కొత్తదనం అంటూ ఏం కనిపించలేదు. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

మనోజ్ తో పాటు మారియా ర్యాబోషప్కా, ఆర్.పార్తీబన్, కాంచన ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హనుమా రెడ్డి యక్కంటి డైరెక్ట్ చేయబోతున్నాడు. భరత్ మోత్కూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మాతలు. 

Full View

Tags:    

Similar News