రాక్ స్టార్ మంచు మనోజ్ గేర్ మార్చాడు. కొన్నాళ్లుగా సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా భైరవంలో కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో ఆకట్టుకుంటున్నాడు. సెప్టెంబర్ లో రాబోతోన్న తేజ సజ్జా సూపర్ హీరో మూవీ మిరాయ్ లో తనే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. నెక్ట్స్ మళ్లీ హీరోగా మారాడు. ఈ సినిమా పేరు 'డేవిడ్ రెడ్డి'.
హనుమ రెడ్డి యక్కంటి డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోందట. 1897 - 1922 మధ్య కాలంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందని టౌటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు చెప్పారు. పోస్టర్ తో పాటు యాడ్ చేసిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. "మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు. ఢిల్లీలో పెరిగాడు. ప్రస్తుతం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు. రెబలియన్ బిగిన్స్".. అనే లైన్స్ చూస్తే ఇది స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది. మరి ఈ వీరుడి పోరాటానికి స్ఫూర్తి ఎవరో కానీ.. హీరోగా మనోజ్ కు బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుందా లేదా అనేది చూడాలి.