Mandana Karimi : ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు : మందనా కరిమి
Mandana Karimi : తన భర్తతో విడిపోయాక ఓ డైరెక్టర్‌తో సిక్రెట్ రిలేషన్‌షిప్ మైంటైన్ చేశానాని తెలిపింది నటి, మోడల్ మందనా కరిమి.;
Mandana Karimi : తన భర్తతో విడిపోయాక ఓ డైరెక్టర్‌తో సిక్రెట్ రిలేషన్‌షిప్ మైంటైన్ చేశానాని తెలిపింది నటి, మోడల్ మందనా కరిమి.. అయితే ఆ డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని వెల్లడించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న లాకప్ షోలో ఈ కామెంట్స్ చేసింది మందనా.
ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు సీక్రెట్ రివీల్ ఆప్షన్ ఎంచుకున్న మందనా... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టింది.. ఆ దర్శకుడు మహిళా హక్కుల గురించి మాట్లాడుతాడని... అతను చాలామందికి ఒక స్పూర్తి అని పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళానని, కానీ ఆ సమయంలో తన స్నేహితులు అడంగా నిలబడ్డారని పేర్కోంది.
కాగా మందనా.. 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను వివాహం చేసుకుంది.. ఐదు నెలల తర్వాత అతని నుండి విడిపోయింది. అతనిపై మరియు అతని కుటుంబంపై గృహ హింస కేసును దాఖలు చేసింది మందనా.