రవితేజ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త చెప్పింది మాస్ జాతర సినిమా యూనిట్. ఆయన హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. టీజర్ లో రవితేజ లుక్, యాక్షన్ సన్నివేశాలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ సేసిరేలియో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పండగ కు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది మూవీ యూనిట్.