Mathu Vadalara 2 : బాక్సాఫీస్ మత్తు వదిలించింది..

Update: 2024-09-14 10:00 GMT

చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ తర్వాత ఇప్పుడు మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మెరిసింది. శ్రీ సింహా, సత్య, ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈమూవీకి యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. రిలీజ్ కు ముందే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో కనిపించింది మత్తు వదలరా 2. రితేష్ రాణా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ తోనే నవ్వించారు. ఇప్పుడు సినిమాలో అంతకు మించిన నవ్వులు పంచి అదరగొట్టారు. బాక్సాఫీస్ ను మరోసారి గెలుచుకున్నారు.

మత్తు వదలరా 2 ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 5.3 కోట్లు వసూళ్లు చేసి వారెవ్వా అనిపించింది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. సినిమా బావుంది. మౌత్ టాక్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఈ వీకెండ్ కు బాక్సాఫీస్ మత్తును పూర్తిగా వదిలించేలానే ఉన్నారు. ఓవరగా 25 -30 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. హిలేరియస్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ స్టోరీ లైన్ తోనూ మెప్పించిన ఈ మూవీతో శ్రీ సింహా ఖాతాలో మరో హిట్ పడింది. అయితే ఈ విజయంలో మేజర్ షేర్ మాత్రం కమెడియన్ సత్యదే అంటే అతిశయోక్తి కాదు. 



Tags:    

Similar News