Chiranjeevi : అత్తయ్యకు మెగాస్టార్ నివాళులు..

Update: 2025-08-30 11:15 GMT

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన అత్తగారు అయిన కనకరత్నమ్మ గారికి నివాళులు అర్పించారు. "మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి అని రాసుకొచ్చారు మెగాస్టార్. కాగా పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు అల్లు అరవింద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News