Bappi Lahari: బప్పీలహరి ధరించిన గణేశ్ గొలుసును చూసి మైఖేల్ జాక్సన్ ఫిదా..!
Bappi Lahari: బప్పి లాహిరి యొక్క బంగారు గణేశ గొలుసు మైఖేల్ జాక్సన్‌ను ఆకర్షించింది. అతడి వేషధారణ చూసి 'ఫెంటాస్టిక్, నీ పేరు ఏమిటి? అని అడిగాడు పాప్ సింగర్.;
Bappi Lahari: బప్పి లాహిరి యొక్క బంగారు గణేశ గొలుసు మైఖేల్ జాక్సన్‌ను ఆకర్షించింది. అతడి వేషధారణ చూసి 'ఫెంటాస్టిక్, నీ పేరు ఏమిటి? అని అడిగాడు పాప్ సింగర్. 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్‌తో తన మొదటి సమావేశం గురించి బప్పి లాహిరి ఒకసారి వెల్లడించారు.
1996లో మైఖేల్ ముంబై పర్యటన సందర్భంగా, తాను మైఖేల్‌ని కలిసానని చెప్పాడు. ఓసారి కపిల్ శర్మ షోలో పాల్గొన్న బప్పి ఈ సంఘటన వివరించాడు. మైఖేల్ ముంబైకి వచ్చినప్పుడు, నేను ఎక్కడో కూర్చున్నాను. అతడు నా దగ్గరకు వచ్చి గణేశ్ లాకెట్టుతో ఉన్న నా బంగారు గొలుసును గమనించాడు. 'ఓ మై గాడ్, ఫెంటాస్టిక్! నీ పేరు ఏమిటి?' అని అడిగాడు. దాంతో నన్ను నేను మైఖేల్ జాక్సన్‌కి పరిచయం చేసుకున్నాను అని షోలో వివరించాడు బప్పీలహరి.
"'నువ్వు కంపోజర్వా?' అని అడిగాడు. దానికి నేను 'అవును, డిస్కో డాన్సర్ చేశాను' అన్నాను. జైసే హాయ్ డిస్కో డ్యాన్సర్ బోలా, వో బోలే (నేను డిస్కో డ్యాన్సర్ అని చెప్పగానే, అతను 'నాకు మీ పాట జిమ్మీ జిమ్మీ ఇష్టం' అని చెప్పాడు.
బప్పి చనిపోవడానికి ఒక నెలరోజు ముందు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతడు చేరిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దీపక్ నంజోషి మాట్లాడుతూ, బప్పీ ఒక నెల పాటు ఆసుపత్రిలో ఉన్నారు.సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే మంగళవారం అతని ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు వైద్యుడిని ఇంటికి పిలిపించారు. కానీ పరిస్థితి విషమించడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతనికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
బప్పి డా అని ముద్దుగా పిలుచుకునే అతను 1980లు మరియు 1990లలో గొప్ప విజయాలు సాధించాడు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్, యార్ బినా చైన్ కహాన్ రే, తమ్మా తమ్మా లోగే, కోయి యహాన్ నాచే నాచే, ఓహ్ లా లా వంటి చాలా పాటలు అతడికి పేరు తెచ్చిపెట్టాయి.