Mohan Babu : ఇంట్రెస్టింగ్ : మహేష్ బాబుతో మోహన్ బాబు.. !

Mohan Babu : మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతుంది.

Update: 2022-01-25 06:32 GMT

Mohan Babu : మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కబోతుంది. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీరోల్ ప్లే చేయనున్నాడట.. మహేష్ బాబుకి మామయ్యగా ఆ పాత్రని డిజైన్ చేశారట త్రివిక్రమ్. సినిమాలో ముఖ్యమైన పాత్ర కావడంతో ఇందులో నటించేందుకు మోహన్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. పరుశురాం దర్శకుడు. 

Tags:    

Similar News