ఎవరు ఎన్ని హిట్లు కొట్టినా.. ఇండస్ట్రీ హిట్ అనే మాట వింటే హీరోలకు ఓ గర్వం వస్తుంది. ఆ రేంజ్ విజయం పడటం అంత సులువేం కాదు. అయితే ఆ విజయమే ఆ ఇండస్ట్రీకి ఫస్ట్ అయితే ఇంకెలా ఉంటుంది. అందుకే ప్రస్తుతం మోహన్ లాల్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా క్లౌడ్ నైన్ లో విహరిస్తున్నారు. ఎందుకంటే ఆయన లేటెస్ట్ మూవీ తుడరుమ్ కేరళకు సంబంధించి ఓ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శోభన.. మోహన్ లాల్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత ఇతర ఆడియన్స్ కు పెద్దగా తెలిసిన నటీ నటులు లేరు. అయితేనేం ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో మినిమం ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో.. ఇక్కడ కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదు. లేదంటే మన్యం పులి రేంజ్ లో విజయం సాధించి ఉండేదేమో.
ఇక ఈ మూవీ సాధించిన రికార్డ్ ఏంటంటే.. కేవలం కేరళ రాష్ట్రంలోనే 100 కోట్ల గ్రాస్ సాధించింది తుడరుమ్. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ మూవీ ఇదే. మోహన్ లాల్ ఈ ఏజ్ లో కూడా రికార్డుల వేటను ఆపలేదు. కుర్రాళ్లు చిన్న కథలతో మంచి విజయాలు సాధిస్తుంటే.. ఇతను కూడా వారికి ఏ మాత్రం తీసిపోను అంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆల్ టైమ్ కేరళ రికార్డ్ ను కొట్టేశాడు. ఇకపై ఇంకెవరైనా ఈ ఫీట్ సాధించినా వాళ్లు మోహన్ లాల్ తర్వాత అనే మాటను వాడాల్సిందే.
ఇక ప్రపంచ వ్యాప్తంగా తుడరుమ్ ఇప్పటికే 200 కోట్లు కొల్లగొట్టింది. అయినా ఇప్పటికీ అనేక చోట్ల బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. ఈ కారణంగానే ఓటిటి వాళ్లు కూడా కొన్నాళ్లు ఆగి తర్వాత ఓటిటిలో వదులుదాం అనుకుంటున్నారట. విశేషం ఏంటంటే.. ఇదేమీ భారీ బడ్జెట్ మూవీ కాదు. మినిమం బడ్జెట్ తోనే తెరకెక్కిన చిత్రం. ఏదైనా రికార్డ్స్ అంటే ఇలా ఉండాలి.