Mohanlal : బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న మోహన్ లాల్

Update: 2025-05-07 12:30 GMT

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మూవీ తుడరుమ్. తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదలైంది. ఆ తర్వాతి రోజు తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేశారు. కానీ ఇక్కడ ప్రాపర్ ప్రమోషన్స్ లేక ఎవరూ పట్టించుకోలేదు. బట్ మళయాలంలో మాత్రం తుడరుమ్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయిపోయింది. మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ జోడీగా చెప్పుకునే మోహన్ లాల్ సరసన శోభన నటించింది. చాలా సాధారణంగా మొదలైన ప్లాట్ ఆ తర్వాత అసాధారణమైన మలుపులతో దృశ్యం తరహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చూస్తున్న ప్రతి ఒక్కరినీ సర్ ప్రైజ్ చేస్తుందీ మూవీ. ఇప్పటికే కేరళలోనే 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడో 120 కోట్లు దాటేసింది.

ఏ సినిమా అయినా వారం తర్వాత స్లో అవుతుంది. బట్ తుడరుమ్ రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. మార్చి 27న మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ మూవీకి పూర్తి భిన్నమైన కంటెంట్ తో కమర్షియల్ గా మరో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు మోహన్ లాల్. ఈ కథలోని డెప్త్ ను అతను బాగా అర్థం చేసుకున్నాడు అనే ప్రశంసలు వస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలిచిన తుడరుమ్ కు తెలుగులోనూ మంచి మౌత్ టాక్ ఉంది. కానీ అందుకు తగ్గ కలెక్షన్స్ అయితే కనిపించడం లేదు. బట్ చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా థ్రిల్ అవుతారని చెప్పొచ్చు.

Tags:    

Similar News