Allu Arjun: పుష్పరాజ్ అడ్డాలో ఖరీదైన కార్లెన్నో..
Allu Arjun: మెగాస్టార్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నా తనకంటూ సొంత ఇమేజ్‌ని సెట్ చేసుకున్నాడు..;
Allu Arjun: పాన్ ఇండియా స్టార్ పుష్పరాజ్ ప్రపంచానికి పరిచయమయ్యాడు.. ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్టైల్‌తో, డ్యాన్సులతో యువతలో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు.
మెగాస్టార్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నా తనకంటూ సొంత ఇమేజ్‌ని సెట్ చేసుకున్నాడు.. లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న ఈ స్టైలిష్ స్టార్.. పుష్ప సినిమా తర్వాత అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. మరి ఆ రేంజ్‌లోనే పారితోషికం కూడా ఉంటుంది.. అందుకే ఆయన గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉంటాయి.. ఇప్పటికే ఈ సూపర్ హీరోకి ఖరీదైన ప్రైవేట్ జెట్ ఉంది.. గ్యారేజీలో అయిదు ఖరీదైన కార్లు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం..
1. రేంజ్ రోవర్ వోగ్
అల్లు అర్జున్ తన వాహనాలకు తాను కూడా ఓ పేరు పెట్టుకుంటాడు.. ఈ రేంజ్ రోవర్ వోగ్‌కి బీస్ట్ అని పేరు పెట్టాడు. రూ. 2.5 కోట్ల విలువైన ఈ అద్భుతమైన కారును ఇల్లు కొనుగోలు చేసినప్పుడు కొన్నాడు. సెలబ్రిటీలకు ఇష్టమైన SUV ఇది. దీని ధర రూ. 1.88 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు ఉంటుంది.
2. ఫాల్కన్ వానిటీ వాన్
ఒక స్టార్ హీరోకి వానిటీ వ్యాన్ అవసరం. తన అభిరుచులకు తగ్గట్టు దాన్ని మలుచుకుంటారు. బన్నీకి నలుపంటే ప్రాణం. అందుకే అతని వ్యానిటీ వ్యానిటీ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అతని కస్టమైజ్డ్ జెట్ బ్లాక్ వానిటీ వ్యాన్‌కి ఫాల్కన్ అని పేరు పెట్టాడు. దీని ఖరీదు రూ. 7 కోట్లు. ఇంటీరియర్స్ అన్నీ నలుపు, ఎరుపు, తెలుపు రంగులలో ఉన్నాయి. ఈ వ్యానిటీ వ్యాన్‌లో ఉన్న సౌకర్యాలన్నీ 5 స్టార్ హోటల్ సూట్‌లా కనిపిస్తుంది!
3. హమ్మర్ H2
ఈ కారు కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకే ప్రముఖులైన తమ గ్యారేజీలో పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ అల్లు అర్జున్ స్టైలే వేరు. హమ్మర్ H2ని తన కోసం స్పెషల్‌గా తెప్పించుకున్నాడు. ఈ కారు గంటకు 190కిమీల వేగంతో దూసుకుపోతుంది. దీనికోసం రూ. 75 లక్షలకు పైగానే ఖర్చు పెట్టాడు.
4. జాగ్వార్ XJL
క్లాసిక్ వైట్ కలర్‌లో అందంగా ఉన్న జాగ్వార్ XJLని ఈ స్టార్ హీరో తన ఈవెంట్‌లు, ప్రమోషన్‌ల కోసం తరచుగా ఉపయోగిస్తాడు. ఈ కారు ధర రూ.1.2 కోట్ల పైమాటే.
5. వోల్వో XC90 ఎక్సలెన్స్
ఈ శక్తివంతమైన కారు 6 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. తన అభిమానులను పలకరించేందుకు బన్నీ తరచుగా కారు పైకప్పును ఉపయోగిస్తాడు. కారు ధర రూ.1.30 నుండి రూ. 1.35 కోట్లు.