Mr Bachchan 1st Day Collections : మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత..?

Update: 2024-08-16 08:11 GMT

రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. బాలీవుడ్ రైడ్ అనే చిత్రానికి రీమేక్ గా వచ్చిన బచ్చన్ కు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ వచ్చింది. అస్సలే మాత్రం బాలేదనే అంటున్నారు. ఓ విధంగా హరీశ్ శంకర్ కెరీర్ లోనే ఇంత డిజాస్టర్ మూవీ లేదని తేల్చేస్తున్నారు చూసిన వాళ్లంతా. దీనికి తోడు రిలీజ్ కు ముందు అతను ఇచ్చిన హైప్ ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. సీరియస్ మూవీని ఎంటర్టైన్మెంట్ తో లాగిద్దాం అనుకున్న హరీశ్ అభాసు పాలయ్యాడు అంటున్నారు. రవితేజకు ఎలాగూ ఫ్లాపులు వచ్చినా ఫరక్ పడదు.. ఎందుకంటే అతను అలవాటు పడిపోయాడు. హరీశ్ శంకర్ కే అన్ని విమర్శలూ వస్తున్నాయి.

అసలే లో బజ్ తో విడుదలైన మిస్టర్ బచ్చన్ కు నెగెటివ్ టాక్ రావడంతో అది కలెక్షన్స్ పైనా ప్రభావం చూపించింది. దీంతో మొదటి రోజు కేవలం 6. 40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది కూడా జీఎస్టీతో కలిపి. సో.. కలెక్షన్స్ పరంగా చూసినా మూవీ డిజాస్టర్ వైపు దూసుకుపోతుందని చెప్పొచ్చు. కాస్త పెద్ద హీరోలు, దర్శకుల సినిమాలు కూడా పర్ఫార్మ్ చేయకపోవడంతో బాక్సాఫీస్ కూడా బాగా డల్ గా కనిపిస్తుండటం చూస్తున్నారు. మొత్తంగా మిస్టర్ బచ్చన్ రవితేజకు మరో డిజాస్టర్ గా మిగిలింది. 

Tags:    

Similar News