Daughter of Prasad Rao : డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది

Update: 2026-02-23 16:56 GMT

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో..

రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ సిరీస్‌లో చేసిన కారెక్టర్ మాత్రం మైల్ స్టోన్‌లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. నా స్నేహితుడు శ్రీరామ్ ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జయంత్ గారు, అనురాధా గారికి థాంక్స్. ఫిబ్రవరి 27న మా సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయ భాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

నిర్మాత కె.వి. శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘జీ5లో నాకు జయంత్, అనురాధా మేడం ఇచ్చే సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు రాజీవ్ కనకాల ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. అయితే ఈ సిరీస్ చూసిన తరువాత నాకు ప్రసాద్ రావు మాత్రమే కనిపించారు. పాత్రలో ఎంతో ఇమిడిపోయారు. ఉదయ భాను నాకు మంచి స్నేహితురాలు. ఆమె పోషించిన కారెక్టర్ ఎంతో బాగుంటుంది. నా ప్రొడక్షన్‌లో నా ఫ్రెండ్స్‌కి మంచి పాత్రలను ఇచ్చాననే సంతృప్తి నాకు కలిగింది. ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అయ్యే సిరీస్ ఇది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన కృష్ణకి థాంక్స్. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు.

దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చాలా బాగుంటుంది. నా దగ్గర ముందే ఓ లైన్ మాత్రమే ఉండేది. అది జయంత్ గారి దగ్గరకు వెళ్లడంతో పూర్తి కథగా మారింది. అనురాధ మేడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడకు వరకు వచ్చింది. ‘రెక్కి’ తరువాత నేను ఈ కథనే రాశాను. ఈ స్టోరీ మొత్తం రాయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు.

ఉదయ భాను మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ రిలీజ్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. చాలా వేగంగా ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాం. నేను ఇందులోని కథకు, కారెక్టర్‌కు ఎంతో కనెక్ట్ అయ్యాను. నా తొలి రోజుల్లో జీ తెలుగు ఎంతో సపోర్ట్ చేసింది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జయంత్ గారికి థాంక్స్. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చిన శ్రీరామ్‌ సలహాలు తీసుకుంటూ ఉంటాను. శ్రీరామ్‌తో ఎన్నో ఏళ్ల నుంచి గొప్ప స్నేహబంధం ఉంది. పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఓ తల్లిగా ఈ పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన సిరీస్. ఇప్పుడున్న సమాజానికి ఈ సిరీస్ ఎంతో అవసరం. రాజీవ్ నాకు మంచి మిత్రుడు. వాసంతిక మంచి నటి. ఈ కథను గొప్పగా మలిచిన, తెరకెక్కించిన కృష్ణ గారికి హ్యాట్సాఫ్. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’

జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ .. ‘జీ5 తెలుగులో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తరువాత మళ్లీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ రాబోతోంది. కృష్ణ ముందుగా రెండు, మూడు పాత్రలతో లైన్ అనుకున్నారు. ఆ తరువాత పూర్తి కథను సిద్దం చేశాం. రాజీవ్ కనకాల గారు, ఉదయ భాను గారు ఇలా క్యాస్టింగ్ అంతా భారీగానే సిద్దం చేసుకున్నాం. ఇందులోని ఫాదర్ కారెక్టర్ నాకు ఎక్కువగా కనెక్ట్ అయింది. మహేష్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఈ సిరీస్‌లో శృతి మంచి డైలాగ్స్ రాశారు. కృష్ణ గారితో మీటింగ్స్ షార్ట్‌గా ఉంటాయి కానీ సక్సెస్‌లు మాత్రం పెద్దగా ఉంటాయి. శ్రీరామ్‌కి జీ5తో ఎన్నో ఏళ్ల బంధం ఉంది. టాలెంట్ ఉన్న వారిని ఉదయ భాను గారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సిద్దు, కిరణ్మయి ఈ ప్రాజెక్ట్‌కి ఎంతో కష్టపడి పని చేశారు. ఫిబ్రవరి 27న ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరినీ తప్పకుండా అలరిస్తుంది’ అని అన్నారు.

కెమెరామెన్ మహేష్ మాట్లాడుతూ .. ‘జీ5లో నాకు ఇది నాలుగో ప్రాజెక్ట్. శ్రీరామ్‌ గారితో హ్యాట్రిక్. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా కంప్లీట్ చేశాం. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ శృతి మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ఎమోషనల్ స్టోరీ. ఈ సిరీస్ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కథ అంతా పూర్తి అయిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఈ కథ నాకెంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌లో నేను ఒక చిన్న పాత్రను పోషించాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రాజీవ్ గారి వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. జీ5 తెలుగు వాళ్లు తెలుగు వాళ్లతో చేస్తున్న ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కువ సక్సెస్ అవ్వాలి. ఈ సిరీస్ ఫిబ్రవరి 27 స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదొక మంచి థ్రిల్లర్‌గా నిలుస్తుంది’ అని అన్నారు.

నటి వాసంతిక మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ రెండు ఎపిసోడ్స్ చూసిన వారంతా కూడా నా పర్ఫామెన్స్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. కృష్ణ గారి వల్లే నేను అలా నటించగలిగాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన జీ5 టీంకి, శ్రీరామ్ గారికి థాంక్స్. రాజీవ్ కనకాల గారితో కూతురిగా నాకు ఇది రెండో ప్రాజెక్ట్. ఉదయ భాను గారి పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది. గాయత్రి భార్గవి గారి పాత్ర బాగుంటుంది. మా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీంని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Tags:    

Similar News