Ranveer Singh : రణ్‌వీర్ సింగ్‌కు ముంబయి పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?
Ranveer Singh : న్యూడ్ ఫోటో వివాదం కేసులో... బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.;
Ranveer singh : న్యూడ్ ఫోటో వివాదం కేసులో... బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు. ఈ నెల 22న విచారణ కోసం చెంబూరు పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. రణ్‌వీర్ నివాసానికి వెళ్లిన ముంబై పోలీసులు.... అతడికి నోటీసులు అందజేశారు. రణ్‌వీర్ తన నగ్న ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు వారిని అవమానపరిచారంటూ ఓ ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గత నెలాఖరులో రణ్‌వీర్ ఓ మ్యాగజీన్ కోసం నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో వాటిని చూసిన నెటిజన్లు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ రణ్‌వీర్ సింగ్‌పై ఫిర్యాదు రావడంతో తాజాగా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.