Priya Bhavani Shankar : నా శరీరం వస్తువు కాదు.. గ్లామర్‌గా కనిపించడం నచ్చదు : ప్రియా భవాని శంకర్
నాగ చైతన్య నటించిన "దూత" వెబ్ సిరీస్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్. ఆ తరువాత హీరో గోపీచంద్ తో భీమా సినిమా చేసింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ మొదటినుండి చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న ప్రియా ప్రస్తుతం బ్లాక్ సినిమా చేస్తోంది. జీవా హీరోగా నటించిన ఈ హారర్ మూవీ అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ గ్లామర్ షో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నా శరీరాన్ని నేను ఒక వస్తువుగా భావించను. ప్రేక్షకులను థియేటర్స్‌లోకి రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటివి నేను చేయలేను. కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదనుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది ప్రియా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.