Mythri Movie Makers : కంటెట్ లీక్.. ఎవరైనా వదలమంటూ ప్రకటన
పైరసీ బెడద సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజ్ చేసిన గంటల్లోనే ఫైరసీ సైట్లలో దర్శనమిస్తుంది.;
పైరసీ బెడద సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజ్ చేసిన గంటల్లోనే ఫైరసీ సైట్లలో దర్శనమిస్తుంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రాలకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేశ్ తో సర్కారువారిపాట సినిమా చేస్తుంది. సర్కారువారి పాట ఫస్ట్ లుక్, పుష్ప సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదల సమయం కంటే ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చక్కర్లు కొట్టాయి.
అయితే లీకుల వ్యవహారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్‌గా తీసుకుంది. సైబర్ పోలీసులకు ఆశ్రయించారు. సినిమాల ఫస్ట్ లుక్, సాంగ్స్ ముందుగానే సోషల్ మీడియాలో దర్శనివ్వడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ట్వీట్ చేసింది. ''ఇటీవలే మేం చేస్తున్న సినిమాలు సర్కారువారిపాట, పుష్పకు సంబంధించిన కంటెంట్ ముందుగానే బయటకు రావడం మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది. ఎవరో కావాలనే ఈ పనులను చేసి రాక్షసానందాన్ని పొందుతున్నారు.
ఇటువంటి పనుల వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై ఉండే ఎగ్జయిట్‌మెంట్ పోతుంది. కాబట్టి మా మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు'' అంటూ ఓ లెటర్‌ను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది.