మైత్రీ మూవీ మేకర్స్.. ప్రామిసింగ్ మూవీస్ తో ఆకట్టుకుంటోంది ఈ ప్రొడక్షన్ హౌస్. మొదట తెలుగులోనే మూవీస్ తీశారు. తర్వాత మెల్లగా ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీస్ కు సిద్ధం అయ్యారు. ఆ క్రమంలో చేసిన మూవీస్ కూడా ఆకట్టుకోవడంతో దాన్నే కంటిన్యూ చేయాలనుకున్నారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అక్కడ ఇప్పుడు ఏకంగా 8మంది హీరోలను లైన్ లో పెట్టుకోబోతున్నారు. ఈ హీరోల లిస్ట్ చూస్తే షాకింగ్ గా ఉంది. అంటే ఆ హీరోల రేంజ్, మార్కెట్ తో పాటు కంటెంట్స్ విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
మైత్రీ వాళ్ల ఫస్ట్ టార్గెట్ సూర్యపైనే ఉంది. ఈ మధ్య సూర్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. బట్ ఇకపై చేయబోయే మూవీస్ విషయంలో మాత్రం ప్రామిసింగ్ గా ఉన్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ తో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తర్వాత కరుప్పు, ఆపై ఓ మళయాల దర్శకుడితో కూడా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మైత్రీ వాళ్లతోనే ఓ మూవీ కమిట్ కాబోతున్నాడు.
తర్వాత వినిపిస్తున్న పేరు శింబుది. శింబు కూడా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. బట్ వెట్రిమారన్ తో చేస్తున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. అతని ఫోకస్ అంతా ఆ మూవీపైనే ఉంది. ఆపై మైత్రీ వాళ్ల మూవీ చేయబోతున్నాడు. ఇక శివకార్తికేయన్ కూడా మైత్రీ బ్యానర్ లో ఓ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ త్వరలోనే రానున్నాయి.
ఇవి కాక మణికందన్, ధృవ్ విక్రమ్, సూరి, కెవిన్, రిషికాంత్ హీరోలతో వరుసగా ఒక్కో సినిమా చేయబోతోంది మైత్రీ బ్యానర్. ఈ మూవీస్ తో పాటు ఆయా వివరాలు కూడా త్వరలోనే తెలియజేయడానికి సిద్ధం అవుతోంది. ఏదేమైనా ఒకే భాషలో ఏకంగా వేర్వేరు హీరోలతో 8 మూవీస్ అంటే చాలా అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. మరి ఈ బ్యానర్ ఇంక చేయబోయే మ్యాజిక్ లు ఏంటో చూడాలి.