Toxic movie : టాక్సిక్ పోస్ట్ పోన్.. కారణం ఏంటీ అంటే

Update: 2026-03-04 07:53 GMT

కేజీఎఫ్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో యశ్. అతని తర్వాతి మూవీ విషయంలో కాస్త రాంగ్ స్టెప్ వేశాడు అనిపించారు. బట్ గ్లింప్స్, టీజర్ తో అదరగొట్టాడు. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. బట్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాస్త లైట్ గా తీసుకున్నారు. ఆ కారణంగా ఈ మూవీ వాయిదా పడబోతోందా అనిపించారా కొందరు. ఫైనల్ గా టాక్సిక్ వాయిదా పడింది. జూన్ 4 న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇది ధురంధర్ 2తో పోటీ కారణంగా కాదు అని కూడా తేల్చింది.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కొన్ని దేశాల్లో దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ టైమ్ లో మా సినిమా విడుదల చేయడం కుదరదు అని తెలుసు. ఆ కారణంగానే టాక్సిక్ ను వాయిదా వేస్తున్నాం అంది నిర్మాణ సంస్థ. ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉంది. గ్లోబల్ ఆడియన్స్ కూ మా మూవీ రీచ్ కావాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకే ఈ యుద్ధం కారణంగా మూవీ వాయిదా వేస్తున్నాం అన్నారు. మొత్తంగా ఈ మూవీ పోస్ట్ పోన్ వల్ల చాలా సమస్యలు వచ్చేలా ఉన్నాయి అనుకోవడానికి లేదు. అలాగే ధురంధర్ 2 వల్ల అని కూడా లేదు. ఆల్రెడీ ధురంధర్ పై మిడిల్ ఈస్ట్ లో బ్యాన్ విధించారు. ఇప్పుడు సీక్వెల్ తో వచ్చే సమస్యలు కూడా ఏం లేవు. సో.. టాక్సిక్ పోస్ట్ పోన్ కారణంగా ధురంధర్ 2కు సోలో రిలీజ్ పడింది.

Tags:    

Similar News