Naga Chaitanya: విడాకులకు కారణం అదేనా? క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య..
Naga Chaitanya: నాగచైతన్య మాత్రం ఒక్కసారి కూడా నేరుగా విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోలేదు.;
Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: టాలీవుడ్‌లోనే ఒకప్పుడు క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత విడాకుల విషయాన్ని ఇంకా ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అందుకే వీరిద్దరి ఎక్కడికి వెళ్లినా.. వీరికి విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి సమంత ఎన్నోసార్లు సమాధానం చెప్పినా.. నాగచైతన్య మాత్రం ఒక్కసారి కూడా నేరుగా ఈ ప్రశ్నలు ఎదుర్కోలేదు. తాజాగా చైతూ కూడా ఈ ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమా షూటింగ్‌లోనే తాను బిజీగా గడిపేస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చిత్రాన్ని కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు చైతూ. ఇటీవల ఓ మీట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య.. మరోసారి తన విడాకుల గురించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇప్పటికే సమంత, నాగచైతన్య విడాకులకు కారణం సామ్ నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదంతా అబద్ధం అని సామ్ కొట్టిపారేసినా.. చైతూ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన కుటుంబం ఇబ్బందిగా ఫీల్ అయ్యే సినిమలేవీ తాను చేయనని క్లారిటీ ఇచ్చేశాడు నాగచైతన్య.
చైతూ ఇలాంటి స్టేట్‌మెంట్ చేయడంపై మరోసారి సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2లోని బోల్డ్ సీన్సే వీరి విడాకులకు కారణమన్న రూమర్ తెరపైకి వచ్చింది. కానీ సమంతకు మాత్రం ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డునే తెచ్చిపెట్టింది. అంతే కాకుండా సామ్.. ఏ కామెంట్స్‌ను పట్టించుకోకుండా తన కెరీర్‌ను తనకు నచ్చినట్టు మలుచుకునే పనిలో పడింది.