Naga Chaitanya, Samantha Divorce: విడిపోయినా ఆ పోస్ట్ విషయంలో కలిసే..: చై సామ్

Naga Chaitanya, Samantha Divorce: మూడు ముళ్ల బంధం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. అందరి దృష్టిని ఆకర్షించారు. మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.;

Update: 2021-10-02 10:51 GMT

Naga Chaitanya, Samantha Divorce:మూడు ముళ్ల బంధం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. అందరి దృష్టిని ఆకర్షించారు. మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చైసామ్‌లలో తమని తాము చూసుకున్నారు లవర్స్. ఎందుకు విడిపోయారో ఎవరూ బయటపెట్టక పోయినా.. విడాకులు తీసుకునేంత గొడవలు ఏమున్నాయి ఇద్దరి మధ్యలో అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

సమంత అక్కినేని వారింటి కోడలయ్యాక కూడా అవకాశాలు క్యూ కట్టినా ఆచి తూచి అడుగేస్తూ తన నిర్ణయం సరైనదే అని నిరూపించుకుంది. అక్కినేని సమంతగా చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఆఖరికి వెబ్ సిరీస్‌లో కూడా తనదైన ముద్ర వేసింది. మరి వివాహ బంధం ఎందుకు వివాదమయ్యిందో అర్థం కావట్లేదు ఎవ్వరికీ. చై సామ్ విడిపోతున్నామంటూ ఒకే విధంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News