Naga Chaitanya Samantha: చైసామ్ చివరి సెల్ఫీ అప్పుడే..
Naga Chaitanya Samantha: నాగచైతన్య, సమంతల విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.;
Naga Chaitanya Samantha: నాగచైతన్య, సమంతల విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే వీరిద్దరు బిగ్ స్క్రీన్ మాత్రమే కాదు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా. అందుకే వీరు ఏ పోస్ట్ పెట్టిన గంటలోనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతుంటాయి. చై, సామ్ ఇద్దరిలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేది సామ్ మాత్రమే. అందుకే వారిద్దరికి సంబంధించి ఏదైనా స్పెషల్ సందర్భం ఉందంటే చాలు.. వెంటనే దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియా మిత్రులతో పంచుకుంటుంది. అలా సామ్, నాగచైతన్యతో కలిసి దిగిన చివరి ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల పండుగ. అందుకే పెళ్లైనా కూడా ఇంకా ప్రేమ పక్షుల్లాగా తిరిగే చైతన్య, సమంత కూడా ఆరోజు స్పెషల్‌గా ఒక డిన్నర్ డేట్‌ను ప్లాన్ చేసుకున్నారు. అక్కడ తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది సామ్. మా ఇద్దరివి మరిన్ని ఫోటోలు పోస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోటో ఇక క్రిస్మస్‌కే అంటూ క్యాప్షన్ పెట్టింది. కానీ ఇంతలోపే విడాకుల విషయం బయటికి రావడంతో తన ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు.