Allu Arjun : అల్లు అర్జున్ మూవీపై నాగవంశీ అప్డేట్

Update: 2025-04-01 08:30 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. రాజమౌళి తోడు లేకుండా తెలుగు నుంచి ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ఫస్ట్ హీరో అతను. పుష్ప 2 తో హయ్యొస్ట్ కలెక్షన్స్ కూడా సాధించాడు. నార్త్ బెల్ట్ లో అతనికి విపరీతమైన ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందనేది నిజం. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి ముందుగా అట్లీ సినిమాతో రాబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈచిత్రంలో అల్లు అర్జున్ డ్యూయొల్ రోల్ చేస్తాడు అనే ప్రచారం ఉంది. అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉండటం కాదు అసలుకే ఆగిపోయిందనీ.. ఒకవేళ ఉన్నా రెండేళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుందనే కమెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు నాగవంశీ.

అట్లీ మూవీ ముందుగా మొదలైనా.. త్రివిక్రమ్ సినిమా షెడ్యూల్ ప్రకారమే స్టార్ట్ అవుతుందట. ఈ యేడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తాజాగా తేల్చి చెప్పాడు. అంటే అట్లీతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ లో ఉంటాయన్నమాట. ఇక మరో విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న మూవీ సోషియలో ఫాంటసీ అనే టాక్ ఉంది. బట్ అదేం లేదట. పూర్తిగా మైథలాజికల్ కథగానే రాబోతోందని చెప్పాడు. తెలుగులో పౌరాణికాలు రాక చాలాకాలం అయింది. బాలయ్య, బాపు కాంబోలో వచ్చిన శ్రీ రామరాజ్యమే చివరిది అనుకోవచ్చు. శ్రీ రామరాజ్యం తర్వాత వీరి కాంబోలో వచ్చేదే పౌరాణికం అవుతుంది. పౌరాణికాలపై త్రివిక్రమ్ కు మంచి పట్టు ఉంది అని చెబుతారు. మరి ఆ కథలను అతను తనదైన శైలిలో ఎలా చెబుతాడా అనే ఆసక్తి కూడా అందర్లో ఉంది. ఏదేమైనా ఈ మైథలాజికల్ మూవీ ఆరంభం నుంచే ఓ క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. 

Tags:    

Similar News