Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్6 లో నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు..
Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్ 6, సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతోంది.;
Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ సీజన్ 6, సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతోంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు.. దిగ్విజయంగా సాగిపోతోంది. తాజాగా సీజన్ 6 మరొ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయి హల్చల్ చేస్తోంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైంది. ఎప్పటిలాగే నాగార్జున భారీగానే రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారు. ఈ సీజన్ 6కు సుమారు రూ.15కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంచనా. గత సీజన్ 5లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12లక్షలు తీసుకున్నారు. మొత్తం సీజన్‌కు 12 కోట్లు తీసుకున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు కూడా వారి పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తారు.