Naa Saami Ranga : నాగార్జున 99వ మూవీ.. ఫస్ట్ లుక్ రివీల్
నాగార్జున కొత్త సినిమాగా 'నా సామిరంగ';
సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య హిట్టే కరువైంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న ఈ హీరో.. కొన్ని రోజుల క్రితం 'ఘోస్ట్' సినిమాతో వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో అలరించలేదు. దీంతో కాస్తా టైమ్ తీసుకుని ఆయన ఇప్పుడు ఓ మంచి కథతో ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు 'నా సామీరంగ' అనే టైటిల్ ఖరారు కాగా.. తాజాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆయన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా రివీలైన నాగార్జున ఫస్ట్ లుక్ లో ఆయన రగ్డ్ లుక్ లో మాస్ గా కనిపిస్తున్నాడు.
Naa Saami Ranga🤟
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 29, 2023
Ippudu #KingMassJataraమొదలు 🔥🔥
Our next with the King 👑@iamnagarjuna garu titled #NaaSaamiRanga 💥
World Wide Release on Sankranti 2024🤩
Here's the Title Glimpse
➡️ https://t.co/0PuVDhdykA#HBDKingNagarjuna 🎊@ChoreographerVJ @mmkeeravaani… pic.twitter.com/5k88K8XNei
ఆయన మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించాడు. గజిబిజి జుట్టు, గడ్డం కలిగి ఉన్నాడు. చేతిలో బీడీ వెలిగిస్తూ కనిపించాడు. అబ్బురపరిచే విజువల్స్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ అయిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ లుక్ ఇప్పుడు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
నాగార్జున 99వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక 'నా సామిరంగ' 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్‌గా డ్రామాగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు నాగార్జున.. మోహన్ రాజాతో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. మోహన్ రాజా ఇటీవల చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాను దర్శకత్వం వహించారు. ఇక నాగ్ తన 101వ సినిమా కోసం ఓ మలయాళీ సినిమాను రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పొరింజు మరియం జోస్ అనే సినిమాను తెలుగులో నాగార్జున చేయనున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారని తెలుస్తోంది.
Full View