Akhanda Making : అఖండ మేకింగ్..అఘోరా పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశాడంటే ?

Akhanda Making : తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

Update: 2022-01-23 13:45 GMT

Akhanda Making : బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే మాములుగా ఉండదు... తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం డిసెంబర్ 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. అఘోరాగా బాలయ్య నటనకి అంతా ఫిదా అయిపోయారు.. పదిరోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసిన ఇక ఈ సినిమా.. తాజాగా 200 కోట్ల క్లబ్‌‌లో చేరింది. అటు ఓటీటీలో కూడా అఖండ రికార్డులు క్రియేట్ చేస్తోంది. స్ట్రీమింగ్‌ మొదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్‌ సాధించి రికార్డు నెలకొల్పింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్‌ సన్నివేశాలను బోయపాటి ఎంత శ్రద్ధతో తెరకెక్కించారో మేకింగ్ వీడియోలో చూపించారు. మధ్యమధ్యలో మురళీ కృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా కొన్ని కనిపిస్తాయి. ఇక ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదిలావుండగా బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Full View


Tags:    

Similar News